Marri Janardhan Reddy Fired on Congress : కాంగ్రెస్ దుష్ప్ర‌చారం మ‌ర్రి ఆగ్రహం

బీఆర్ఎస్ చేసిన అప్పు రూ. 2.8 ల‌క్ష‌ల కోట్లే

Hello Telugu - Marri Janardhan Reddy Fired on Congress

Hello Telugu - Marri Janardhan Reddy Fired on Congress

Marri Janardhan Reddy : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి (Marri Janardhan Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అప్పుల‌పై దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత 10 ఏండ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లేన‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర స‌ర్కార్ పార్ల‌మెంట్ సాక్షిగా తెలియ చేసింద‌న్నారు. ఈ పది సంవ‌త్స‌రాల కాలంలో తెలంగాణలో పెరిగిన ఆస్తుల విలువ 4.16 లక్షల కోట్లు అని స్ప‌ష్టం చేసింద‌న్నారు. ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపినా 3.5 లక్షల కోట్లు దాట లేద‌న్నారు. కానీ కావాల‌ని త‌మ‌ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Marri Janardhan Reddy Slams Congress

రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలచిన ఘ‌న‌త మాజీ సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డ. సచివాలయం మొదలు కలెక్టరేట్లు, దవాఖానల వరకు నిర్మాణం చేప‌ట్టార‌న్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించ‌డం ద్వారా తెలంగాణ ఆర్థిక పరిపుష్టి జ‌రిగింద‌న్నారు మాజీ ఎమ్మెల్యే. అప్పుల్ని దాటి 4.16 లక్షల కోట్లకు ఆస్తుల‌ను పెంచితే నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. కాగా రూ. 8 లక్షల కోట్లంటూ ఇప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీ తప్పుడు ప్రచారం చేయ‌డం వారి అవ‌గాహ‌న రాహిత్యాన్ని సూచిస్తుంద‌న్నారు. పదేండ్ల ప్రగతి, ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్నా అవే కట్టుకథలు అల్ల‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ఫైర్ అయ్యారు.

బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనపై రేవంత్‌రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గం, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పిందన్నారు.

Also Read : KTR Fired on Rahul Gandhi : తెలంగాణ‌లో రాహుల్ చేసింది ఓటు చోరీ కాదా..?

Exit mobile version