CM Chandrababu – AP Growth : ఐటీ పార్కుల ఏర్పాటుకు ఏపీ బెట‌ర్ – సీఎం

వ‌ర్క్ స్టేష‌న్ల కోసం ప్ర‌భుత్వం స‌హ‌కారం

Hello Telugu - CM Chandrababu - AP Growth

Hello Telugu - CM Chandrababu - AP Growth

CM Chandrababu : సింగ‌పూర్ – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) సింగ‌పూర్ లో బిజీగా ఉన్నారు. నాలుగో రోజున వరుస భేటీలు నిర్వ‌హించారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా స‌మావేశం అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంలతో సీఎం చర్చ‌లు జ‌రిపారు.

CM Chandrababu Key Comments on AP Growth

అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని సమావేశంలో వివరించారు నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని చెప్పిన కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు . వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్సిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్ లేతో చంద్రబాబు జ‌రిపిన చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయి.

రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖ‌త వ్య‌క్తం చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్ కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్-SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్ తో సమాలోచనలు జ‌రిపారు. వివిధ ప్రాజెక్టుల్లో అవసరమైన ఆర్థిక భాగస్వామ్యంపై SMBC ప్రతినిధితో చర్చించారు. ఫైనాన్స్, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని చంద్రబాబుకు వివరించిన SMBC ప్రతినిధి రాజీవ్ కన్నన్. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై టెమసెక్ హెల్డింగ్స్ ప్రతినిధి దినేష్ ఖన్నాతో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రిపారు.

Also Read : MLA Raja Singh Shocking Comments : బీజేపీ రా ర‌మ్మంటే నేనొద్దంటానా

Exit mobile version