MLA Raja Singh Shocking Comments : బీజేపీ రా ర‌మ్మంటే నేనొద్దంటానా

గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్

Hello Telugu - MLA Raja Singh Shocking Comments

Hello Telugu - MLA Raja Singh Shocking Comments

MLA Raja Singh : హైద‌రాబాద్ – గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను ఇటీవ‌లే బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డ్డారు. చివ‌రి వ‌ర‌కు తాను కూడా రేసులో ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు. ఆపై రాష్ట్ర బీజేపీ నేత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌పై కూడా బీజేపీ చీఫ్ రామ‌చందర్ రావు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఎవ‌రైనా, ఎంత‌టి వారైనా స‌రే పార్టీ ముఖ్య‌మ‌ని , వ్య‌క్తులు కాదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి తాను బీజేపీలో ఉండ‌లేనంటూ , త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌తంలో కూడా త‌ను స‌స్పెండ్ అయ్యాడు. ఆ త‌ర్వాత తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం హిందూ క‌ట్ట‌ర్ గా రాజా సింగ్ కు పేరుంది.

MLA Raja Singh Key Comments

తాజాగా మీడియాతో మాట్లాడిన త‌ను బీజేపీ పై త‌న‌కు ఎలాంటి కోపం లేద‌న్నారు. అయితే కొంద‌రి వ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లుగుతోంద‌ని బాధ‌తో తాను కామెంట్స్ చేశాన‌న్నారు. ఒక‌వేళ బీజేపీ హైక‌మాండ్ నుంచి త‌న‌కు పిలుపు వ‌స్తే ఆలోచిస్తాన‌ని చెప్పారు రాజా సింగ్. బీజేపీ త‌న ఇల్లు అని, ర‌మ్మంటే మ‌ళ్లీ చేరుతానంటూ ప్ర‌క‌టించారు. త‌న‌కు వేరే పార్టీల నుంచి ర‌మ్మ‌ని, చేర‌మ‌ని ఆహ్వానం వ‌చ్చినా తాను వెళ్లేది లేదంటూ స్ప‌ష్టం చేశాడు రాజా సింగ్. త‌న‌కు వేరే పార్టీలు స‌రి పోవ‌న్నారు. బీజేపీ పార్టీకి మాత్రమే రాజీనామా చేశాన‌ని.. ఎమ్మెల్యే పదవికి చేయలేద‌న్నారు. ఇంకో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేను.. నా పదవికి రాజీనామా చేయనని ప్ర‌క‌టించాడు. నా ప‌రంగా కూడా కొన్ని త‌ప్పులు జ‌రిగాయ‌ని ఒప్పుకున్నాడు. తాను లీక్ చేస్తున్నానంటూ మా పార్టీకి చెందిన వాళ్లే అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ని వాపోయాడు.

Also Read : MP Harish Balayogi Alarming : కోనసీమలో కొబ్బరి ఉత్పత్తి సంస్థలు నెలకొల్పండి

Exit mobile version