బెంగళూరు : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం, తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి తనకు చెందిన బెంగళూరు ప్యాలెస్ లో వివాహం జరిపించ వద్దంటూ కోర్టుకు ఎక్కాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. షర్మిలకు ఝలక్ ఇచ్చింది. వైఎస్ షర్మిలకి వ్యతిరేకంగా దేవనహళ్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది . షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆస్తిలోకి ప్రవేశించకుండా లేదా దానిలో జోక్యం చేసుకోకుండా కోర్టు నిషేధించింది. గోడలు, కంచెలు, చెట్లు లేదా ఇతర నిర్మాణాలను పాడు చేయవద్దని కోర్టు వారిని ఆదేశించింది.
వైఎస్ జగన్ బెంగళూరు నివాసం వెలుపల షర్మిల నిరసన ప్రదర్శనకు ప్రణాళిక రచిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు షర్మిల ప్రమేయంతో రాజకీయ కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్ బెంగళూరు నివాసంలోకి ప్రవేశించ వద్దని వైఎస్ షర్మిల ను దేవనహళ్లి కోర్టు స్పష్టం చేసింది. ఆస్తిలో జోక్యం చేసుకోకుండా షర్మిల, కుటుంబ సభ్యులు, మద్దతుదారులను నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాల ప్రకారం, షర్మిల , ఆమెతో సంబంధం ఉన్నవారు ఆ ఆస్తిలోకి ప్రవేశించకూడదు లేదా దాని ప్రాంగణంలో జోక్యం చేసుకోకూడదు. ఆస్తి గోడలు, కంచెలు, చెట్లు , ఇతర నిర్మాణాలకు ఎలాంటి నష్టం కలిగించడాన్ని కూడా కోర్టు నిషేధించింది.
