విశాఖపట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సదస్సు -2206లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని రంగాలలో ఏపీ ముందుకు వెళుతోందని, ప్రత్యేకించి పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధులు, విదేశీ రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖను గుర్తిస్తూ కేంద్రం ప్రకటించిందని చెప్పారు. గిరిజన ధింసా లాంటి నృత్యంతో పాటు ఏపీ సంస్కృతీ సంప్రదాయాలతో అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం ఇది అని వెల్లడించారు సీఎం.
రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సోలార్ వేఫర్స్, సౌర ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ లాంటి అంశాల్లో ఏపీ పనిచేస్తోందని తెలిపారు. క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో అత్మనిర్భరతా, అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు కోసం స్పేస్ విజన్, సెమికండక్టర్ మిషన్ , లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం,గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ మిషన్స్‌ను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించడం జరిగిందన్నారు క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుతో పాటు క్వాంటం పరికరాలను మేడ్ ఇన్ అమరావతి ముద్రతో తయారు చేస్తాం అన్నారు. పౌర అవసరాలు, డిఫెన్స్ అప్లికేషన్ల కోసం డ్రోన్లను తయారు చేసేందుకు డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను రవాణా చేస్తున్నాం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా ప్రపంచానికి హార్టీకల్చర్ హబ్‌గా ఏపీని మారుస్తాం అన్నారు. 12 ఎక్స్ స్పీడ్ ఆఫ్ అప్రూవల్స్‌తో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం అని తెలిపారు. 303 ఎంఓయూల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.



















