Air India Flight Fired : ఇంజిన్ లో మంట‌లు తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్

వ‌రుస ప్ర‌మాదాల‌తో బెంబేలెత్తి పోతున్న ప్ర‌యాణీకులు

Hello Telugu - Air India Flight Fired

Hello Telugu - Air India Flight Fired

Air India : ఢిల్లీ – మ‌రోసారి ఎయిర్ ఇండియా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ సంస్థ‌కు చెందిన విమానాలు త‌రచూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. ఆదివారం అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ జ‌రిగిన ఘ‌ట‌న ఢిల్లీలో చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా (Air India) విమానం ఇండోర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే విమానం ఇంజిన్ లో మంట‌లు రావ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యాడు పైల‌ట్. త‌క్ష‌ణ‌మే కంట్రోల్ రూంకు విష‌యం తెలియ చేశాడు. ఆ వెంట‌నే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు రిట‌ర్న్ రావాల్సిందేగా సంకేతాలు వెళ్లాయి. దీంతో పెను ప్ర‌మాదం నుంచి ప్ర‌యాణీకులు బ‌య‌ట ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. సుర‌క్షితంగా ఢిల్లీలో ల్యాండింగ్ అయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Air India Flight Fire

ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉదయం 6:15 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇందులో 90 మందికి పైగా ప్ర‌యాణీకులు ప్ర‌యాణం చేస్తున్నారు. పైలట్ విమానం కుడి ఇంజిన్‌లో “అగ్ని సూచన” అందుకున్నాడు. A320 నియో విమానం ఒక ఇంజిన్ ఆపి వేశారు వెంట‌నే. ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఆగస్టు 31న ఢిల్లీ నుండి ఇండోర్‌కు నడుస్తున్న AI2913 విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది, కాక్‌పిట్ సిబ్బందికి సరైన ఇంజిన్ కోసం అగ్నిప్రమాద సూచన అందింద‌ని టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ మరిన్ని వివరాలను వెల్ల‌డించింది. ఈ విమానం ఢిల్లీలో తిరిగి దిగడానికి ముందు 30 నిమిషాలకు పైగా గాల్లోనే ఉంది.

Also Read : CM Revanth Reddy Fired on BRS : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీఆర్ఎస్ కు చిత్త‌శుద్ది లేదు

Exit mobile version