Indian Govt : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు శుభవార్త. ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులకు మరో ప్రాధాన్యత గల పథకానికి లబ్ధి పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. రైతులు ఒక్క రూపాయి కూడా జేబు ఖర్చు చేయకుండా వృద్ధాప్యంలో వార్షికంగా రూ.36,000 పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Indian Govt – పీఎం కిసాన్‌తో అనుసంధానమైన పెన్షన్ పథకం
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన (PM-KMY) పథకాన్ని ఇప్పుడు పీఎం కిసాన్ పథకంతో అనుసంధానించింది. దీంతో ఇప్పటికే పీఎం కిసాన్ (PM-KMY) పథకంలో నమోదు చేసుకున్న రైతులు వేరుగా ఆధారాల సమర్పణ లేకుండానే పెన్షన్ పథకానికి అర్హులవుతారు.
ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతులకు వృద్ధాప్యంలో నెలకు రూ.3,000 లేదా ఏడాదికి రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. ముఖ్యంగా రైతులు తమ జేబు నుంచి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ సహకారం నేరుగా పీఎం కిసాన్ పథకంలోని రూ.6,000 వార్షిక సహాయ మొత్తంలోంచి తీసుకుంటారు.
ఎవరు అర్హులు? ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ పథకానికి 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల రైతులు అర్హులు. ఒకసారి ఈ పథకానికి చేరిన రైతులు 60 ఏళ్లు నిండిన తర్వాత జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ పొందుతారు. రైతులు తమ సమీప ప్రజా సేవా కేంద్రం (CSC)కు వెళ్లి, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో రిజిస్ట్రేషన్ చేయాలి.
CSC ఆపరేటర్ రైతుల సమాచారంతో ఆన్లైన్‌లో నమోదు చేస్తారు. ఆటో డెబిట్ ఫారమ్ నింపడం ద్వారా, నెలవారీ సహాయం నేరుగా పీఎం కిసాన్ (PM-KMY) నిధిలోని రూ.6,000 నుంచి తీసుకుంటారు.
ఎటువంటి ఖర్చు లేకుండానే పెన్షన్
ఈ పథకంలో రైతులు నెలకు రూ.55 నుండి రూ.200 వరకు సహకారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రైతుల జేబు ఖర్చు కాకుండా, పీఎం కిసాన్ నిధిలోని మొత్తంలో నుంచి ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఉదాహరణకు, ఒక రైతు 40 ఏళ్ల వయస్సులో నమోదు చేసుకుంటే నెలకు రూ.200 చొప్పున ఏడాదికి రూ.2,400 కట్ అవుతుంది. మిగిలిన రూ.3,600 నేరుగా రైతు ఖాతాలోకి జమ అవుతుంది.
పెన్షన్ ఐడీ, భద్రత కల్పన
నమోదైన తర్వాత రైతులకు ప్రత్యేక పెన్షన్ ఐడీ నంబర్ ఇవ్వబడుతుంది. ఇది వారి భవిష్యత్తు పెన్షన్ పొందడంలో కీలకం కానుంది. పేరు నమోదు లేకపోతే పీఎం కిసాన్ పోర్టల్‌లో మీ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతుల భవిష్యత్తుకు భరోసా
ఈ పథకం వల్ల రైతులు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను పొందే అవకాశం ఉంది. పెన్షన్ ద్వారా వారికీ నెలవారీ స్థిర ఆదాయం లభిస్తుంది. పెన్షన్ పొందేందుకు ముందుగానే నమోదు చేసుకోవడం ద్వారా రైతులు తమ భవిష్యత్తును మరింత సురక్షితంగా చేసుకోవచ్చు.
Also Read : PM Modi Shocking Comments : ట్రంప్ సుంకాలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు


















