Shilpa Shetty: సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడు పెంచిన శిల్పా శెట్టి

సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడు పెంచిన శిల్పా శెట్టి

Hello Telugu - Shilpa Shetty

Shilpa Shetty: చిత్ర పరిశ్రమలోనికి వచ్చి మూడు దశాబ్దాలు పూర్తయినా… చెక్కు చెదరని అందం… అభినయంతో అదే క్రేజ్ ను కొనసాగిస్తున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. ‘బాజీగర్‌’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ పొడుగుకాళ్ళ సుందరి… ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

అదే సమయంలో ‘సాహస వీరుడు సాగర కన్య’, ‘వీడెవడండీ బాబు’, ‘ఆజాద్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకుంది. అయితే రాజ్ కుంద్రాను పెళ్ళి చేసుకున్న శిల్పా… సినిమాలకు ప్యాకప్ చెప్పి… రియాలిటీ షోలు, ఫిట్ నెస్ క్లాసులతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వస్తుంది.

Shilpa Shetty – ‘సుఖీ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శిల్పా శెట్టి

రియాలిటీ షోలు, ఫిట్ నెస్ క్లాసులతో బోర్ కొట్టిందో ఏమో గాని మరల ఈ పొడుగుకాళ్ళ సుందరి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సోనాల్ జోషి దర్శకత్వంలో ‘సుఖీ’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. శిల్పా శెట్టి(Shilpa Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఓ పంజాబీ గృహిణి జీవితం చుట్టూ తిరిగే కథను తన కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ ‘సుఖీ’ విజయం సాధించడంతో… చిత్ర యూనిట్ ఈ సినిమాకి సీక్వెల్‌ గా ‘సుఖీ 2’ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కూడా శిల్పా శెట్టి కీలక పాత్ర పోషించగా… ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్న చిత్ర యూనిట్… ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

Also Read : Hero Suriya: కడపకు సూర్య ‘కంగువా’ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com