ముంబై : సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్, రాజ్వీర్ డియోల్ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీంతో వారిద్దరి మధ్య బహుశా ప్రేమ సంబంధం ఉండొచ్చనే ఊహాగానాలకు దారితీసింది. అయితే సారాకు సన్నిహితంగా ఉన్న వారు దీనిని ఖండించచారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, వారిద్దరూ ఇప్పటి వరకు కలుసు కోలేదని పేర్కొంది .ఈ పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. సారా, రాజ్వీర్ ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. సారా ఒంటరిగా ఉంది, తన పనిపైనే దృష్టి పెట్టింది. ఈ ఊహాగానాలు అనవసరం, ఆందోళన కలిగించేవి పేర్కొన్నారు. సారా తన వ్యక్తిగత జీవితాన్ని హుందాగా, గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది కాబట్టి, ఈ పుకార్లపై బహిరంగంగా స్పందించే అవకాశం లేదన్నారు.
తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి, తన పెళ్లి రోజు ఎలా ఉండవచ్చో ఒక సూచనలా ఉందని వర్ణిస్తూ సారా టెండూల్కర్ గతంలో పెళ్లిపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఆమె ఆ అనుభవాన్ని తన భవిష్యత్ వివాహానికి ఒక ‘పరీక్షా దశ’గా అభివర్ణించినట్లు సమాచారం. వివాహంపై తన ఆలోచనలను ఆమె సరదాగా వెల్లడించారు. వోగ్తో మాట్లాడుతూ సారా తన సోదరుడి వివాహాన్ని ఒక విలువైన అభ్యాస అనుభవంగా అభివర్ణించారు. అది నాకు ఒక గొప్ప పరీక్షా దశగా అనిపించింది. ఇప్పుడు నాకు ఏమి కావాలో, ఏమి వద్దో నాకు తెలుసు అని సారా టెండూల్కర్ అన్నారు. జెన్ జెడ్ తరం వారిలో సంబంధాలు , వివాహంపై తన అభిప్రాయాలను కూడా ఆమె పంచుకున్నారు. తమ తరం వారు వివాహాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారని, కానీ ఒక సంబంధం సరిగ్గా లేదని అనిపించినప్పుడు దాని నుండి బయట పడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్ట పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.


















