India Shocking England : ఇంగ్లండ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన టీమిండియా

జ‌డేజా, సుంద‌ర్ సెంచ‌రీ 4వ టెస్టు డ్రా

Hello Telugu - India Shocking England

Hello Telugu - India Shocking England

India : ఇంగ్లండ్ – మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన 4వ టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు భార‌త ఆట‌గాళ్లు ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్. ఇండియాను ఓట‌మి నుంచి కాపాడారు. డ్రాగా ముగించ‌డంలో ఈ ఇద్ద‌రు కీల‌క పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్ల‌కు చుక్క‌లు చూపించారు. జ‌డేజా 107 ప‌రుగుల‌తో, సుంద‌ర్ 101 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచారు. ఆట‌ను ఆపేద్దామంటూ బ్రూక్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను వీరు తిర‌స్క‌రించారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఊహించ లేదు. అంత‌కు ముందు భారీ స్కోర్ సాధించింది. విజ‌యం త‌ప్ప‌ద‌ని అనుకున్నారంతా.

India Shocking to England Team

కానీ అడ్డుగోడ‌లా నిలిచారు ఈ ఇద్ద‌రూ . వారి అకుంఠిత ప‌ట్టుద‌ల ముందు బౌల‌ర్లు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఒక ర‌కంగా ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న ఈ సీరీస్ లో ఈ మ్యాచ్ మాత్రం ఎల్ల‌కాలం భారతీయ (India) క్రికెట్ అభిమానుల‌కు గుర్తుండి పోతుంది. అస‌మాన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించారు ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్. అజేయ శ‌త‌కాల‌తో దుమ్ము రేపారు. డ్రాగా ముగియ‌డంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ ఇద్ద‌రు గ‌నుక అడ్డు గోడ‌గా నిల్చోక పోతే ఇంగ్లండ్ ఇవాళ అత్య‌ధిక స్కోర్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసి ఉండేది. ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో ఇంకో మ్యాచ్ మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆతిథ్య జ‌ట్టు 2 మ్యాచ్ ల‌లో గెలుపొంద‌గా టీమిండియా ఒక మ్యాచ్ లో విజ‌యం సాధించింది. దీంతో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లండ్.

అంత‌కు ముందు భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్, కేఎల్ రాహుల్ లు స‌మ‌య స్పూర్తితో ఆడారు. గిల్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా రాహుల్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో మెరిపించాడు. గిల్ 103 ర‌న్స్ చేస్తే రాహుల్ 90 ప‌రుగుల‌తో డ్రాలో కీల‌క పాత్ర పోషించాడు. మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్ కు టెస్టు మ్యాచ్ లో ఉన్న మ‌జా ఏమిటో తెలిసింది.

Also Read : Popular Vande Bharat Sleeper : త్వరలో పట్టాల మీదకు రానున్న వందే భారత్ స్లీపర్ క్లాస్ ట్రైన్

Exit mobile version