President Murmu : న్యూఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహిళా వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకుని ఛాంపియన్లుగా నిలిచిన భారత క్రికెట్ మహిళా జట్టును ప్రశంసలతో ముంచెత్తారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu). న్యూఢిల్లీలోని రాజ్ భవన్ లో ఆమె ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా అరుదైన రికార్డును నెలకొల్పినందుకు ఆనందంగా ఉందన్నారు. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టన్ స్మృతీ మందన్నా తో పాటు జట్టులోని సభ్యులు, మేనేజ్మెంట్, సిబ్బంది, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యవర్గం అంతా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిశారు.
President Murmu Appreciates Women Cricket Team
ఈ సందర్బంగా ద్రౌపది ముర్ముతో కలిసి ముచ్చటించారు . జట్టు సభ్యులను పేరు పేరునా పలకరించారు ఆత్మీయంగా దేశాధ్యక్షురాలు. యావత్ 143 కోట్ల భారతీయులు గర్వ పడేలా చేశారని, మిమ్మల్ని చూసి తనకు మరింత సంతోషంగా ఉందన్నారు ముర్ము. మహిళలు మహరాణులని నిరూపించారని, మీరు సాధించిన ఈ అద్భుతమైన విజయం సామాన్యమైనదని అన్నారు. వరల్డ్ కప్ ను సాధించినందుకు ప్రశంసలు కురిపించారు ద్రౌపది ముర్ము. ఇదిలా ఉండగా బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ. 51 కోట్ల నగదు ఇస్తున్నట్లు తెలిపింది. మరో వైపు దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా నజరానాలు ప్రకటించడం విశేషం.
Also Read : Minister Atchannaidu Important Update : త్వరలో ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ


















