YS Jagan : వైఎస్సార్ కడప జిల్లా – దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం చిరస్మరణీయమని అని అన్నారు వైసీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan). జూలై 8న మంగళవారం వైఎస్సార్ జయంతి. ఈ సందర్బంగా కడప జిల్లా ఇడుపులపాయలోని తన ఘాట్ వద్ద జగన్ తన కుటుంబంతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు జగన్ రెడ్డి. తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఏ నాయకుడు చేయని అభివృద్దిని, సంక్షేమ పథకాలను పేదలకు అందించిన గొప్ప నేత అని పేర్కొన్నారు.
YS Jagan Emotional Tweet
చివరి క్షణం వరకు పేదల కోసం పరితపించాడని అన్నారు. ఆయనను చూసి పెరిగానని, ఏనాడూ అధికారం ఉందని గర్వ పడలేదన్నారు. తను మాట ఇచ్చాడంటే ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అమలు చేసి తీరే వాడన్నారు జగన్ మోహన్ రెడ్డి. తనను అనుసరించిన వాళ్లు, తన అడుగు జాడల్లో నడిచిన వాళ్లు వేలాది మంది ఉన్నారన్నారు.
అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైయస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు.
ఈ సందర్బంగా కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైయస్ జగన్‌ను కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read : YS Sharmila-YSR Death Anniversary : మహా నేతకు మరణం లేదు – షర్మిల
