YS Sharmila : వైఎస్సార్ కడప జిల్లా – దివంగత ముఖ్యమంత్రి, మహా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరణం లేదన్నారు తన కూతురు, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). జూన్ 8న మంగళవారం ఆయన జయంతి. ఈ సందర్బంగా తన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తన తల్లి విజయమ్మతో కలిసి. ఈ సందర్బంగా వైఎస్సార్ జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడు తన తండ్రి అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల.
YS Sharmila Comments
తెలుగుదనానికి ప్రతిరూపం మహానేత వైయస్ఆర్ అన్నారు. ఆప్యాయతకు మారుపేరు వైయస్ఆర్ అని పేర్కొన్నారు. జీవితాంతం తను చనిపోయేంత వరకు అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన అరుదైన ప్రజా నేత అన్నారు. ఆయన అందించిన పాలన తరతరాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు బిడ్డగా చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
అద్భుతమైన పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన అపర భగీరథుడు..ఆరోగ్యశ్రీతో ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించిన పేద ప్రజల దేవుడు తన తండ్రి అని కొనియాడారు. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు వైఎస్సార్ . ఆ నవ్వుల రేడు ఇవాళ భౌతికంగా లేక పోవచ్చని కానీ కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాడని అన్నారు.
Also Read : Elon Musk-Tesla Stock Drop Shocking : అమెరికా పార్టీ ఆవిష్కరణ తో పతనమైన టెస్లా షేర్లు
