కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారంటూ బాంబు పేల్చారు. ఆయన నేరుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఆరోపణలు గుప్పించడం చర్చకు దారి తీసింది. అంతే కాదు డబ్బులకు పదవులే కాదు పడుకుంటే కూడా పోస్టులు ఇస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం చర్చకు దారి తీసిలా చేసింది. ఈ సందర్బంగా శనివారం సిరిసిల్లలో పర్యటించారు కేటీఆర్.
పార్టీలో పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నారన్న షబ్బీర్ అలీ వ్యాఖ్యలు వాస్తవమేనని అన్నారు .
అదే రోజున, రేవంత్ రెడ్డికి రూ. 50 కోట్లకు టీపీసీసీ (TPCC) పదవిని అమ్మినప్పుడు కూడా ఇలాగే జరిగిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు మాజీ మంత్రి. రేవంత్ రెడ్డి చేపట్టిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చలేదన్నారు. అందుకే ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దయ్యేలా చేసేందుకు ఆయన ఆ కేసు వివరాలను బయట పెట్టారని బాంబు పేల్చారు కేటీఆర్. అంతే కాదు బెంగాల్ లో 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది, కానీ మమ్మల్ని తొలగించారని కోర్టులో కేసు వేశారన్నారు. అది తేలక ముందే ఎన్నికలు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరిగి పోయిందన్నారు కేటీఆర్.
