YSRCP : మరావతి – వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఎన్డీయే బలపర్చిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి, ప్రస్తుత మరాఠా గవర్నర్ రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరడంతో మనసు మార్చుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వం సమావేశం జరిగిందని, ఇందులో ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని చెప్పారు. శుక్రవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఇండియా కూటమి తరపున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంతో వీరిద్దరి ఎంపిక చాలా నాటకీయంగా జరిగింది. ఇదే సమయంలో పోటీ రసవత్తరంగా మారింది.
YSRCP Voted for NDA Vice President
సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాలు కూడా ముఖ్యమని, అందుకే రాబోయే రోజుల్లో తాము ఎన్డీయే వైపు ఉంటామని చెప్పకనే చెప్పారు జగన్ రెడ్డిపై (YS Jagan). ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ రాజకీయ లెక్కల్లో పాల్గొనడం కంటే, పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీతో అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలో నమ్మకం ఉంచారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్ ఇవి రాజ్యాంగ పదవులు, ఎన్డీఏ మెజారిటీని కలిగి ఉందని స్పష్టంగా కనిపించినప్పుడు సంఖ్యా క్రీడలో అర్థం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తమ పార్టీ ఏర్పడినా తమ పార్టీ గతంలో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అయితే తమ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరిన విషయం విదితమే.
Also Read : PM Modi New Innovation : రూ. 18,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభం
