కూటమి రాకతో ప్రభుత్వ విద్యకు మహర్దశ : మంత్రి సవిత

ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యలో ప్రతిభ పురస్కారాల ప్రదానం

hellotelugu-MinisterSavitha

పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలానికి చేరుకోగలమని, సామాజిక, రాజకీయ గుర్తింపూ లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత తెలిపారు. తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా పేదల విద్యకు ప్రోత్సాహిస్తున్నామన్నారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే అన్ని విధాలా గుర్తింపు లభించడమే కాకుండా పేదరికాన్ని సులభంగా అధిగమించ వ‌చ్చ‌ని చెప్పారు స‌విత‌. తన తండ్రి, మాజీ మంత్రి ఎస్.రామచంద్రా రెడ్డి పేరు మీద ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ స్థాపించి విద్యలో రాణిస్తున్న పేద విద్యార్థులకు భ‌రోసా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థులకు మార్కులే ముఖ్యం కాదని, నైతిక విలువలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని మంత్రి సవిత ఆకాంక్షించారు.

రా.ష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యా రంగం గాడిన పడిందని సవిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాణులతో అత్యుత్తమ బోధన అందిస్తున్నారన్నారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనంతో కూడిన పౌష్టికాహారం ఇస్తున్న‌ట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎందరు విద్యార్థులుంటే అందరికీ రూ.15 వేల చొప్పున అందజేస్తున్నామన్నారు. ఎంజేపీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు విద్యా బోధనతో పాటు క్రీడల్లోనూ రాణించేలా స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ షూట్లు కూడా ఇస్తున్నామన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేశ్ వంద రోజుల ప్రణాళికతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల కంటే అత్యధిక ఫలితాలు సాధించ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో రక్షణతో కూడిన అత్యుత్తమ బోధన అందిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు.

Exit mobile version