PM Modi : ఢిల్లీ – ప్రధానమంత్రి మోదీ బీహార్, బెంగాల్‌లో రూ. 18,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. కోల్‌కతాలో కొత్తగా నిర్మించిన విభాగాలలో మెట్రో రైలు సేవలను కూడా జెండా ఊపి స్టార్ట్ చేశారు. బీహార్‌లోని గయలో ఉదయం 11 గంటలకు దాదాపు రూ. 13,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.. ఆయన రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రసంగించారు. ఆ తర్వాత, గంగా నదిపై అంటో-సిమారియా వంతెన ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రధానమంత్రి సాయంత్రం 4:15 గంటలకు కోల్‌కతాలో కొత్తగా నిర్మించిన విభాగాలలో మెట్రో రైలు సేవలను కూడా ప్రారంభించారు. కనెక్టివిటీని మెరుగు పరచడానికి తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి NH-31లో 8.15 కి.మీ పొడవైన ఆంటా-సిమారియా వంతెన ప్రాజెక్టును ప్రారంభించారు.
PM Modi New Inaugurations
ఇందులో గంగా నదిపై రూ. 1,870 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 1.86 కి.మీ పొడవైన ఆరు లేన్ల వంతెన కూడా ఉంది. ఇది పాట్నాలోని మోకామా , బెగుసరాయ్ మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది, భారీ వాహనాలకు 100 కి.మీ కంటే ఎక్కువ అదనపు ప్రయాణ దూరాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో రద్దీని తగ్గిస్తుంది. ప్రధానమంత్రి జాతీయ రహదారి-31లోని నాలుగు లేన్ల భక్తియార్‌పూర్-మోకామా విభాగాన్ని కూడా ప్రారంభించారు., దీని విలువ దాదాపు రూ. 900 కోట్లు, దీని వల్ల గ్రామీణ కనెక్టివిటీని పెంచుతుంది. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ రూ. 6,880 కోట్ల విలువైన బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ముజఫర్‌పూర్‌లోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. బీహర్, పొరుగు రాష్ట్రాలకు అధునాతన క్యాన్సర్ చికిత్సను అందిస్తుంది.
Also Read : Donald Trump Warning : రష్యాపై యుద్ధం ఉక్రెయిన్ కు ప్రమాదం
