YSRCP Shocking Comments : మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై యుద్దం

పోస్ట‌ర్స్ రిలీజ్ చేసిన వైఎస్సార్సీపీ

Hello Telugu - YSRCP Shocking Comments

Hello Telugu - YSRCP Shocking Comments

YSRCP : తాడ‌పేప‌ల్లిగూడెం : ఏపీ కూట‌మి స‌ర్కార్ పై యుద్దం ప్ర‌క‌టించింది వైఎస్సార్సీపీ (YSRCP). తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామ కృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో పోస్ట‌ర్స్ రిలీజ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని స్ప‌ష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని చెప్పారు ఈ సంద‌ర్బంగా రామ‌కృష్ణా రెడ్డి. అబద్ధాలు చెప్పడం, మోసం చేయ‌డం ఆ త‌ర్వాత‌ దబాయించడం ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు వెన్న‌తో పెట్టిన విద్య అంటూ మండిప‌డ్డారు.

YSRCP Shocking Comments

మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ప్రజలు అందరు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పేద‌ల‌కు, సామాన్యుల‌కు వైద్యాన్ని దూరం చేయ‌డం తప్పా ఈ కూట‌మి స‌ర్కార్ ఏం చేసిందో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య అని మండిప‌డ్డారు రామ‌కృష్ణా రెడ్డి. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Vamsi Krishna Pendyala Shocking Comments : కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు కోలుకోలేని షాక్

Exit mobile version