Vamsi Krishna Pendyala Shocking Comments : కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు కోలుకోలేని షాక్

సీఎం నిర్వాకంపై సీరియ‌స్ కామెంట్స్

Hello Telugu - Vamsi Krishna Pendyala Shocking Comments

Hello Telugu - Vamsi Krishna Pendyala Shocking Comments

Vamsi Krishna Pendyala : హైద‌రాబాద్ : టీపీసీసీ సోష‌ల్ మీడియా మాజీ కార్య‌ద‌ర్శి వంశీకృష్ణ పెండ్యాల (Vamsi Krishna Pendyala) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అధికారికంగా త‌న రాజీనామా ప‌త్రాన్ని వెల్ల‌డించారు. కష్టపడి నిలబెట్టుకున్న కాంగ్రెస్ సోషల్ మీడియా కళ్ళెదుటే కూలుతుంటే, అందుకు కారణం సోషల్ మీడియా చైర్మనే అయితే, గుండె బరువెక్కి ఆవేదనతో తాను త‌ప్పుకోవాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల వరకు సోషల్ మీడియాలో ఎలాంటి సమస్య లేదన్నారు. తాము పూర్తి స్వేచ్ఛతో పని చేశామని, పార్టీకి ఎప్పుడు చెడ్డపేరు రాకుండా పని చేశామన్నారు. అప్పటివరకు సజావుగా సాగుతున్న సమయంలో 2024 ఎన్నికల తర్వాత ఊహించని రీతిలో మీరు పరిస్థితులన్నీ తారుమారు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Vamsi Krishna Pendyala Shocking Comments

ప్రైవేట్ వ్యక్తులకు కాంగ్రెస్ (Congress) సోషల్ మీడియాను అప్పగించారని మండిప‌డ్డారు. అప్పటివరకు స్వేచ్ఛగా పార్టీ సిద్ధాంతాలపై పని చేసిన తాము, పార్టీకి సంబంధంలేని, పార్టీ సోషల్ మీడియా పై ఎలాంటి అవగాహనలేని వ్యక్తులను తీసుకువచ్చారంటూ ఆరోపించారు వంశీకృష్ణ‌. వాళ్ళు  దారి తప్పి పనిచేస్తున్నారని మీ దృష్టికి తీసుకువస్తే, వాళ్ళముందు మమ్మల్ని అవమాన ప‌రిచార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాలయాపన చేస్తూ, కష్టపడిన కార్యకర్తలను దూరం పెడుతూ, ప్రైవేట్ వ్యక్తులను పార్టీలో చేర్చుకుని, వారికి పదవులు ఇచ్చి మా కష్టాన్ని, ఆత్మస్థర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించార‌ని మండిప‌డ్డారు.

ఉద్యోగాలు మానేసి ప్రతిరోజూ పార్టీకోసం కష్టపడ్డ సోషల్ మీడియా నాయకులకు, కార్యకర్తలకు ఏదైనా అవకాశాలు కల్పించాలని కోరితే, వివిధ కారణాలు చెప్తూ దాట వేశారని ఆరోపించారు. ఉంటే ఉండండి పోతే పోండి అంటూ తీవ్రవేదనకు గురిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండేళ్లు గడిచినా, ఇంకా మభ్య పెడుతూనే ఉన్నారని వాపోయారు వంశీకృష్ణ పెండ్యాల‌.

Also Read : Minister Atchannaidu Important Update : ఆక్వా రంగ అభివృద్ధికి లోకేష్ కృషి ప్ర‌శంస‌నీయం

Exit mobile version