ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ స‌భ్యుల అరెస్ట్ అక్ర‌మం

నిప్పులు చెరిగిన ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి స్టాలిన్

hellotelugu-UdhayanidhiStalin

చెన్నై : త‌మిళ‌నాడులో ప్ర‌తిప‌క్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉద‌య‌నిధి స్టాలిన్ నిప్పులు చెర‌గారు. ఎస్ ఎఫ్ ఐ, డీవైఎఫ్ ఐ స‌భ్యుల‌ను అరెస్ట్ చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. చెన్నైలో బుధ‌వారం ఉద‌య‌నిధి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జరిగే నిరసనలను తమకు వ్యతిరేకమైనవిగా భావించి అణచివేసే చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపించ బడుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న వారిని అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డం అప్రజాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు ఉద‌య‌నిది స్టాలిన్.

చెన్నైలోని ఎగ్మోర్ , మదురైలోని తమక్కం ప్రాంతాల్లో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నసభ్యులను పోలీసు బలగాలను ఉపయోగించి బలవంతంగా అరెస్టు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని అన్నారు. సీజేపీ నాయకత్వంలో ఢిల్లీలో పోరాడుతున్న యువతకు మద్దతుగా తమిళనాడులో నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం, నీట్ అంశంపై అధికార పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను స్పష్టంగా తెలియ జేస్తోంద‌ని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జరిగే నిరసనలను తమకు వ్యతిరేకమైనవిగా భావించి అణచివేసే చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలి అని ఆయన అన్నారు, అలాగే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ రాజధానిలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న కాక్రోచ్ జ‌న‌తా పార్టీ యువత పట్ల పోలీసులు ప్రదర్శించిన కఠిన వైఖరిని ఆయన ఖండించారు.ఢిల్లీ నుండి వస్తున్న దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. వారి ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, ప్రభుత్వం పోలీసు బలగాలతో అణచి వేయాల‌ని అనుకోవ‌డ దారుణ‌మ‌న్నారు ఉద‌య‌నిధి స్టాలిన్. ప్రజాస్వామ్యంలో ఇది ఆమోద యోగ్యం కాదన్నారు.

Exit mobile version