ఖాకీల బ‌ల ప్ర‌యోగం సీఎం ఆగ్ర‌హం

కాంగ్రెస్ నేత‌ల‌పై దాడులు దారుణం

hellotelugu-CMSateeshan

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతలపై పోలీసుల అధిక బలప్రయోగం చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు కేర‌ళ సీఎం వీడీ స‌తీష‌న్ . పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. దీని కార‌ణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపిస్తూ నిరసనలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధాని నివాసం వద్ద నిరసనలో పాల్గొన్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కె.సి. వేణుగోపాల్ , ఖ‌ర్గే , డీకే శివ‌కుమార్ , త‌దిత‌రులు పాల్గొన్నారు. తమ నాయకులను పోలీసులు బలవంతంగా తొలగించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

| వారిపై అధిక బలప్రయోగం జరిగింది. అంతకుముందు రోజు కూడా, ఈ అంశంపై కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగింది దాని పునరావృతమే అని ఇక్కడ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత వీడీ స‌తీస‌న్ విలేకరులతో అన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని పేర్కొన్నారు. సూసైడ్ చేసుకున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కరి కూడా చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. ఇదేనా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి అని మండి ప‌డ్డారు సీఎం. ఈ దాడుల‌ను, అరెస్ట్ ల‌ను ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేమన్నారు.

ఈ అంశంపై కేరళ అసెంబ్లీ ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిందని ఆయన పేర్కొన్నారు, అలాగే న్యాయం, తమ హక్కుల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

Exit mobile version