YSRCP : చిత్తూరు జిల్లా : కూటమి సర్కార్ హయాంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం వైసీపీ (YSRCP) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్వతంత్ర భారతదేశంలో కనీవినీ ఎరుగని విధంగా 17 మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తూ వాటిని తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరు వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ విజయానంద రెడ్డి నేతృత్వంలో విద్యార్థులు , యువత, వైయస్ఆర్ సీపీ నాయకులు, మహిళలు రోడ్డెక్కారు. గంగినేని చెరువు వద్ద నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
YSRCP Slams AP Govt
ఈ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తన కోటరీకి ధారాదత్తం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్ర యువతకు ఆశాదీపమైన మెడికల్ కాలేజీలను తన స్వప్రయోజనాల కోసం తన మిత్రులకు, బినామీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నాడని నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం నిర్ణయానికి స్వస్తి పలికి ప్రభుత్వం నిర్మించకుంటే వైయస్ఆర్ సీపీ నేతృత్వంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విజయానంద రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు రెడ్డెప్ప, విద్యార్థులు, యువకులు, మహిళలు , వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read : TTD ex EO Dharma Reddy Shocking Comments : వైవీ సుబ్బారెడ్డిపై మాజీ ఈవో దర్మారెడ్డి కామెంట్స్ ..?
