Dharma Reddy : అమరావతి : సిట్ విచారణలో నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి ఒక్కటొక్కటిగా. తిరుమల శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహారంలో ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు సంస్థ సంచలన ప్రకటన చేసింది. దీంతో వైసీపీకి చెందిన ప్రస్తుత ఎంపీ గా ఉన్న మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైపు అందరి చూపు పడింది. దీనికి కారణం ఆయన హయాంలోనే ఈ వ్యవహారం చోటు చేసుకోవడం. తాజాగా అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి (Dharma Reddy) విచారణ సమయంలో వాస్తవాలు వెల్లడించినట్లు సమాచారం. కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి వైవీఎస్ అని సీబీఐ సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వడం కలకలం రేపుతోంది.
TTD Ex EO Dharma Reddy Slams YV Subbareddy
కల్తీ నెయ్యిని సరఫరా చేసిన బోలెబాబా సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించే విషయంలో తమపై అన్ని విధాల ఒత్తిడి చేయించాడని ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక సదరు సంస్థతో అయిష్టాంగానే నెయ్యి సరఫరాకు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు తెలిపాడు. కల్తీ నెయ్యి అని తెలిసినా ఏమీ చేయలేక పోయామంటూ వాపోయాడు. విచిత్రం ఏమిటంటే వైవీ సుబ్బారెడ్డి ఎవరో కాదు జగన్ రెడ్డికి స్వయానా బంధువు కావడం విశేషం. ఆయన హయాంలోనే అన్యమత సంస్థలు, వ్యక్తులు, అన్నదానం సరిగా లేక పోవడం తదితర సమస్యలు బయట పడ్డాయి. ఇక విచారణ జరిపింది రాష్ట్ర సంస్థ కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో వైసీపీ ఇప్పటి వరకు దీని విషయంలో ఇంకా నోరు విప్పలేదు.
Also Read : TDP Chief Palla Srinivas Clear Instructions : దేశ సమైక్యత కోసం పాటుపడాలి
