ఇరాన్‌తో అమెరికాకు చర్చల ప్రణాళిక లేదు

యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

hellotelugu-Trump

అమెరికా : యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఇరాన్ పై విరుచుకుప‌డ్డారు. త‌ల వంచ‌క పోతే దాడులు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ప‌లుమార్లు ఛాన్స్ ఇచ్చామ‌ని అయినా త‌న తీరు మార్చుకోవ‌డం లేద‌న్నారు . ఇది మంచి ప‌ద్దతి కాద‌న్నారు. తాము కంటిన్యూగా యుద్దం చేస్తూనే ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ప‌లుమార్లు చ‌ర్చ‌ల‌కు రావాల‌ని సూచించినా ప‌ట్టించుకోలేద‌ని పేర్కొన్నారు. అక్కడ అమెరికా దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉందని,, అన్ని వాటర్ మైన్‌లను తొలగించామని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్‌తో సమావేశమై కీల‌క అంశాల‌పై చర్చించారు అధ్య‌క్షుడు ట్రంప్.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇరాన్ తో అమెరికాకు చర్చల ప్రణాళిక లేదని, అయితే పరిమిత రాకపోకలు , జలమార్గం నుండి బయటకు వెళ్తున్న ఓడపై దాడి జరిగినట్లు నివేదికలు ఉన్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి “తెరిచి ఉందని, పనిచేస్తోందని” అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నొక్కి చెప్పారు. అన్ని వాటర్ మైన్‌లను తొలగించామని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య 60 రోజుల చర్చల కాలం ఈ వారం ముగిసిన తర్వాత, యుద్ధానికి స్పష్టమైన ముగింపు కనిపించక పోవడంతో ఈ పోస్ట్ వచ్చింది. ఇదిలా ఉండ‌గా మ‌ధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో ఆయా దేశాలు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నాయి. సాధ్య‌మైనంత మేర‌కు చ‌ర్చ‌లు కొన‌సాగించాల‌ని అటు అమెరికాకు ఇటు ఇరాన్ కు సూచిస్తున్నాయి. ఇంకో వైపు తాను దాడుల‌కు దిగితే ఇరాన్ ఉనికి లేకుండా పోతుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. కాగా అమెరికా అధ్య‌క్షుడు చేసిన హెచ్చ‌రిక‌ల‌ను తాము ప‌ట్టించుకునేది లేదంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది ఇరాన్.

Exit mobile version