YSRCP Syamala Shocking Comments : ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సంత‌కాల సేక‌ర‌ణ

నిప్పులు చెరిగిన వైసీపీ నాయ‌కురాలు శ్యామ‌ల‌

Hello Telugu - YSRCP Syamala Shocking Comments

Hello Telugu - YSRCP Syamala Shocking Comments

Syamala : హైద‌రాబాద్ : ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ అధ్యక్షులు , మాజీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జోరుగా కొన‌సాగుతంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ఐటీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కేపీహెచ్ బీ కాలనీలో టెంపుల్ బస్టాండ్ నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌ (Syamala). ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , వైయస్ఆర్సిపి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ సునీల్ పోసింరెడ్డి వైయస్ఆర్సిపి ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి , వైయస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

YSRCP Leader Syamala Comments

ఈ సంద‌ర్బంగా వైసీపీ రాష్ట్ర నాయ‌కురాలు శ్యామ‌ల మాట్లాడారు. ఏపీలో కూట‌మి స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వ హయాంలో విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌ను ఆదుకున్నార‌ని, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ రంగాల‌న్నీ తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయ‌ని వాపోయారు. ప్ర‌ధానంగా ఇటీవ‌ల మొంథా తుపాను కార‌ణంగా 20 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో రైతులు పంట‌ల‌ను కోల్పోయార‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు వారికి న‌ష్ట ప‌రిహారం అందించ‌లేద‌ని అన్నారు. పీపీపీ మోడ‌ల్ పేరుతో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్ ప‌రం చేసేందుకు చంద్రాబు నాయుడు కుట్ర‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు శ్యామ‌ల‌.

Also Read : Minister Komatireddy Shocking comments : సినీ కార్మికుల‌కు స‌ర్కార్ అండ‌గా ఉంటుంది

Exit mobile version