హైదరాబాద్ : ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల నిర్మాన పథకం కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద, దరఖాస్తుదారులు రూ. 100 దరఖాస్తు రుసుము, రూ. 10,000 ‘ఎర్నెస్ట్ మనీ డిపాజిట్’ చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు కేటాయించినప్పుడు ఈ మొత్తం సర్దుబాటు చేయబడుతుంది లేదా కేటాయింపు జరగకపోతే తిరిగి చెల్లించ బడుతుంది. ప్రతి 1 బిహెచ్ కె ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో లబ్ధిదారుని వాటా రూ. 6 లక్షలు కాగా, ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీని అందిస్తుంది. కోర్ అర్బన్ రీజియన్ ఆఫ్ ఎకానమీ’ ప్రాంతంలో ఇందిరమ్మ ఎల్ పీజీ గృహ నిర్మాణ పథకం’ కోసం 60,000కు పైగా కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. 7,340 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆగస్టు 20న లాటరీ ప్రక్రియ నిర్వహించ బడుతుంది. మరో 1,920 ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 3 చివరి తేదీ.
ఇందిరమ్మ ఇళ్ల’కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 040-24603572 కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలవబడ్డాయి . సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కార్యదర్శి వి.పి. గౌతమ్ తెలిపారు. అర్హులైన వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి. వారికి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు. ఫ్లాట్ల కేటాయింపు లాటరీ విధానం ద్వారా జరుగుతుంది. లబ్ధిదారుడు 30 చదరపు గజాల వరకు ఉండే అవిభాజ్య భూమి వాటాకు యజమాని అవుతారు. ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా మొదటగా హయత్ నగర్, గోషామహల్, ముషీరాబాద్ , బండ్లగూడ ప్రాంతాలలో 10 అంతస్తుల ఇందిరమ్మ ఎల్ఐజీ హౌసింగ్ టవర్లు’ నిర్మించబడతాయి. సెప్టెంబర్ నాటికి లబ్ధిదారులకు 3,192 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలో 2,22,837 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా, ఇప్పటికే ఉన్న కార్డులకు 1,85,946 మంది సభ్యులు అదనంగా చేర్చబడ్డారు.
