Minister Komatireddy Shocking comments : సినీ కార్మికుల‌కు స‌ర్కార్ అండ‌గా ఉంటుంది

ప్రక‌టించిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Minister Komatireddy : హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి స‌ర్కార్ అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి (Minister Komatireddy). హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన సినీ, టెలివిజన్ రంగం ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , సహచర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ తో క‌లిసి పాల్గొని ప్ర‌సంగించారు. సినీ కార్మికులు, టెలివిజన్ రంగం కళాకారులు, టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి భ‌రోసా ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

Minister Komatireddy Venkat Reddy Comments

హైదరాబాదుకు చిత్ర పరిశ్రమను తీసుకు రావడం లోనూ, అభివృద్ధి చేయడం లోనూ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింద‌ని చెప్పారు. ఇకపై మీ సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత బలంగా కృషి చేస్తుందని అన్నారు మంత్రి. త్వరలో టెలివిజన్ రంగం కళాకారుల కోసం ప్రత్యేక అవార్డులు ప్రకటించ బోతున్నామ‌ని తెలిపారు. చిత్రపురి సమస్యను వ్యక్తిగతంగా పరిష్కరిస్తానని మీ కుటుంబ సభ్యునిగా హామీ ఇస్తున్నాన‌ని చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాల‌న్నారు. నవీన్ గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, వచ్చే 10 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానన‌ని చెప్పారు.

Also Read : CM Revanth Reddy Sensational Comments : జూబ్లీహిల్స్ లో ‘హ‌స్తం’ విజ‌యం ఖాయం

Exit mobile version