YSR Death Anniversary : మ‌ర‌ణం లేని నాయ‌కుడు వైఎస్సార్

జూలై 8న రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి

hellotelugu-ysr

YSR : హైద‌రాబాద్ – దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి జూలై 8. డాక్ట‌ర్ కోర్సు చేసినా చివ‌ర‌కు తాను పాలిటిక్స్ నే ఎంచుకున్నాడు. ఆయ‌న‌కు ప్ర‌జ‌లంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అదే త‌న‌ను రియ‌ల్ పీపుల్స్ లీడ‌ర్ గా మార్చేసింది. మాట ఇచ్చాడంటే రాజ‌న్న (YSR) త‌ప్ప‌డు అన్నది త‌న ఇంటి పేరుగా మార్చుకున్నాడు. బ‌ల‌మైన చంద్ర‌బాబు నాయుడును త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చాడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకు వ‌చ్చాడు. ఆయ‌న హ‌యాంలో తీసుకు వ‌చ్చిన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ఇవాల్టికీ రోల్ మోడ‌ల్ గా ఉంది. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల హృద‌యాల‌ను త‌న పాల‌నా రీతిలో ఆక‌ట్టుకున్నాడు. వారి గుండెల్లో నిలిచి పోయాడు.

YSR Death Anniversary

త‌ను చివ‌రి శ్వాస వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం ఏదో చేయాల‌న్న త‌ప‌న‌ను క‌లిగి ఉన్నారు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించిన‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాను ఉన్నంత వ‌ర‌కు ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చే ప్ర‌స‌క్తి లేద‌ని నిండు స‌భ‌లో ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో అప్ప‌టి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ పై తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు ఈటెల‌.

ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా మార్పు కోసం ఒక శక్తిగా కూడా పనిచేసిన వ్యక్తి . ఆయ‌న 1949లో పుట్టారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి 14వ సీఎంగా ప‌ని చేశారు. 2004 నుండి 2009లో అకాల మ‌ర‌ణం వ‌ర‌కు ప‌ద‌విలో కొన‌సాగారు. త‌ను పాలించింది స్వ‌ల్ప కాల‌మే అయిన‌ప్ప‌టికీ ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసి త‌న‌కు త‌నే సాటి అని నిరూపించుకున్నారు వైఎస్సార్. పేద‌ల దేవుడిగా గుర్తింపు పొందారు.

Also Read : HYDRA Sensational : హైడ్రా స‌హ‌కారంతో అడ్డు గోడ‌ను కూల్చేశారు

Exit mobile version