HYDRA Sensational : హైడ్రా స‌హ‌కారంతో అడ్డు గోడ‌ను కూల్చేశారు

అండ‌గా నిలిచిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

hellotelugu-hydraa

HYDRA : హైద‌రాబాద్ – దారికి అడ్డంగా క‌ట్టిన గోడ వేలాది ప్ర‌జ‌ల‌కు గోస‌గా మారింది. ఆఖ‌రుకు అది పోరాటంగా రూపుదిద్దుకుంది. హైద‌రాబాద్ లోని ఔట‌ర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మ‌ల్లంపేట‌, బాచుప‌ల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్ర‌గ‌తిన‌గ‌ర్‌కు సుల‌భంగా చేరుకునే మార్గం దొర‌క‌క అవ‌స్థ‌లు ప‌డ్డారు గ‌త కొన్నేళ్లుగా. ఎవ‌రికి చెప్పుకున్నా ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు హైడ్రా (HYDRA) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ను ఆశ్ర‌యించారు. ఆయ‌న వీరి న్యాయ‌మైన పోరాటానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. మాది గేటెడ్ క‌మ్యూనిటీ మా కాల‌నీలోంచి రాక‌పోక‌లు బంద్ అంటూ అడ్డు గోడ‌లు క‌ట్టారు. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా దుండిగ‌ల్ మండ‌లంలోని మ‌ల్లంపేట – బాచుప‌ల్లి గ్రామాల మ‌ధ్య.

HYDRA Commission Sensational

కాగా మ‌ల్లంపేట ఔట‌ర్ రింగురోడ్డు ఎగ్జిట్ నుంచి బాచుప‌ల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్ర‌గ‌తిన‌గ‌ర్ కు కేవ‌లం 3 కిలోమీట‌ర్లు మాత్ర‌మే ప్ర‌యాణిస్తే స‌రిపోతోంది. కాని దారి మ‌ధ్య‌లో ప్ర‌ణీత్ ఆంటిల్యా వారు నిర్మించిన అడ్డుగోడతో 8 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాల్సి వ‌స్తోంద‌ని మ‌ల్లంపేట గ్రామ ప్ర‌జ‌ల‌తో పాటు.. మ‌రో 10 కాల‌నీల వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అడ్డుగోడ తీసేస్తే 60 నుంచి 40 ఫీట్ల వెడ‌ల్పుతో ఉన్న అడ్డ దారి ఏర్ప‌డుతుంద‌ని భావించారు. వాస్త‌వానికి గేటెడ్ క‌మ్యూనిటీ కాదు.. అయినా గోడ క‌ట్టి మాది గేటెడ్‌ క‌మ్యూనిటీ అంటూ రాక‌పోక‌ల‌ను అడ్డుకుంటున్నార‌ని మ‌ల్లంపేట వాసులు వాపోయారు.

మ‌ల్లంపేట ఎగ్జిట్ నుంచి మ‌ల్లంపేట విలేజ్‌, ప్ర‌ణీత్ లీఫ్‌కాల‌నీ, ఆకాష్ వెంచ‌ర్‌, డ్రీం వ్యాలీ కాల‌నీ, గ్రీన్‌పార్కు కాల‌నీ, సాయిన‌గ‌ర్ కాల‌నీ, బృందావ‌న్ కాల‌నీ, ఏపీఆర్ కాల‌నీ, ఇందిర‌మ్మ కాల‌నీ, ల‌క్ష్మి శ్రీ‌నివాస్ కాల‌నీ, హెచ్ ఎండీఏ, ప్ర‌ణీత్ ఆంటిల్యా, బాచుప‌ల్లి చౌర‌స్తా మీదుగా ప్ర‌గ‌తిన‌గ‌ర్‌కు కేవ‌లం 3 కిలోమీట‌ర్ల రాజ‌మార్గంలో రాడానికి అవ‌కాశం ఉన్నా అడ్డుగోడ‌లు పెట్టార‌ని దీంతో 25 వేల మందికి పైగా అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని ప‌లువురు హైడ్రాకు (HYDRA) ఫిర్యాదు చేశారు. హైడ్రా ప‌రిశీలించింది. చివ‌ర‌కు మ‌ల్లంపేట వాసులు చేసిన పోరాటం ఫ‌లించింది. వీరి ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. క‌ట్టిన గోడను కూల్చేశారు.

Also Read : Minister Vakiti Srihari Sensational : గొర్రెలు, గేదెలు నాకిస్తే ఏం చేసుకోవాలి – మంత్రి

Exit mobile version