YS Sharmila Fired on EC : దొంగ ఓట్ల చేరికతో వ్యవస్థ భ్రష్టు పట్టింది

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఫైర్

Hello Telugu - YS Sharmila Fired on EC

Hello Telugu - YS Sharmila Fired on EC

YS Sharmila : విజ‌య‌వాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాధానం ఎందుకు చెప్ప‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హ‌క్కు వినియోగించ‌డం అన్నారు. సమానత్వం ప్రస్ఫుటంగా కనిపించేది ఒక ఓటు విషయంలోనేన‌ని పేర్కొన్నారు. ఒక పూట కూడా తిండి దొరకని పేదవాడికైనా, లక్షల కోట్లు ఉన్న ధనవంతుడికైనా ఓటు దగ్గర సమానమేన‌ని తెలుసుకుంటే మంచిద‌న్నారు. రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధం లాంటి పవిత్రమైన ఓటు బీజేపీ అధికార దాహానికి దుర్వినియోగం అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

YS Sharmila Slams EC

దొంగ ఓట్ల చేరికతో వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు . దొడ్డిదారిలో బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్ నే కలుషితం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యానికి కాపు కాయాల్సిన ఎన్నిక‌ల సంఘం మోడీకి కాపలా కాస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఏపీపీసీసీ చీఫ్‌. ఎన్నికల కమిషన్ తీరు చూస్తే మేడిపండు చందంగా ఉందన్నారు. స్వతంత్ర వ్యవస్థ కాస్త బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింద‌న్నారు . ఆర్ఎస్ఎస్ లాంటి అనుబంధ సంస్థల జాబితాలో EC కూడా భాగమైందని మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇవ్వాళ దేశంలో ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ చోర్ కమిషన్ గా మారింద‌న్నారు.

రాహుల్ గాంధీ బయట పెట్టిన నిప్పు లాంటి నిజాలపై సమాధానం చెప్పే దమ్ములేక డిక్లరేషన్ అంటూ వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. మోడీకి జీ హుజూర్ అనకపోతే రాహుల్ గాంధీ సంధించిన 5 ప్రశ్నలపై ECI వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : YS Jagan Fired on CM Chandrababu : కూట‌మి పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం

Exit mobile version