YS Sharmila Strong Warning : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేస్తే ఊరుకోం

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల

Hello Telugu - YS Sharmila Strong Warning

Hello Telugu - YS Sharmila Strong Warning

YS Sharmila : విజ‌య‌వాడ – ఏపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ స్టీల్ పై కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. ఆదుకోవడం పచ్చి అబద్ధం అన్నారు. ఉద్ధరించడం అంతా బూటకం అంటూ మండిప‌డ్డారు. ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్ లో 44 EOI లకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది ప్లాంట్ ను చంపే కుట్రలో భాగమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. 5 వేల మంది కార్మికులను ఎందుకు తొలగించారని ప్ర‌శ్నంచారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆ పనులను ఎందుకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని నిల‌దీశారు. ఏపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు.

YS Sharmila key Comments Vizag Steel Plant

విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకు వ‌స్తామంటూ ఇప్పుడు లోపాయికారిగా నాశ‌నం చేసేందుకు కుట్ర‌ల‌కు మోదీ కేంద్ర స‌ర్కార్ తెర లేపింద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. ఇది స్టీల్ ప్లాంట్ యాజమాన్యపు దుర్మార్గపు చర్యకు నిదర్శనం అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ చేతకాని తనానికి అద్దం పడుతుందన్నారు. కేంద్రం డైరెక్షన్ లోనే దశల వారీగా ప్లాంట్ ను చంపుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్ప‌నంగా మోడీ దోస్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. దానికి నిస్సిగ్గుగా చంద్రబాబు మద్దతు ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. ప్లాంట్ లో ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. వెంటనే ఇచ్చిన EOI లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని అన్నారు.

Also Read : CM Chandrababu Alarming : కుండ పోత వ‌ర్షం జ‌ర భ‌ద్రం – సీఎం

Exit mobile version