CM Chandrababu : అమరావతి – కుండపోతగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించాలని, అవసరమైతే అత్యవసర నిధులను వాడుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా భారీ వర్షాలు మరికొన్ని రోజుల పాటు కురుస్తాయని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో చర్చించారు. తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు సీఎం సీఎస్ ను.
CM Chandrababu Key Comments
ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu) వివరించారు విజయానంద్. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండ ప్రాంతాలు కోతలకు గురి కావడంతో అధికారులు ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ప్రజలకు సమాచారం అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సిఎం అన్నారు. ముందస్తు సన్నద్దతతో, అప్రమత్తతో ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు.
Also Read : Akunuri Murali Shocking Comments : విద్యా శాఖపై సీఎం దృష్టి సారించాలి
