YS Sharmila : అమరావతి – కరేడు రైతులది బతుకు పోరాటమని పేర్కొన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. సోలార్ ప్లాంట్ కి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు షర్మిల (YS Sharmila). పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమని అన్నారు.
YS Sharmila Shocking Comments on AP Govt
ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం కాక మరేమిటి అని ప్రశ్నించారు. గత YCP ప్రభుత్వం శిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూ సేకరణకు కనీసం గ్రామ సభలు పెట్టలేదంటూ ధ్వజమెత్తారు. మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమ వద్దనే రైతుల గోడు వినలేదన్నారు. ఇండోసోల్ కంపెనీకి అదనంగా భూములు కేటాయించి, ఊరినే ఖాళీ చేయించాలని చూస్తున్నారని వాపోయారు. శాంతియుత ఉద్యమం చేసే కరేడు గ్రామ ప్రజలను నిర్బంధించడాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
వెంటనే భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై కరేడు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించాలని, రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలన్నారు.
Also Read : YS Jagan New Innovation : పాదయాత్రకు శ్రీకారం ప్రజలతో మమేకం
