YS Jagan New Innovation : పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం

త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాన‌న్న జ‌గ‌న్

Hello Telugu -YS Jagan New Innovation

Hello Telugu -YS Jagan New Innovation

YS Jagan : ఏపీలో మ‌రోసారి పాద‌యాత్ర చేప‌ట్టేందుకు సిద్దం అవుతున్నారు వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan). కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక త‌న పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న సీఎం చంద్ర‌బాబు, త‌న‌యుడు లోకేష్ ల రాజ్యం న‌డుస్తోంద‌న్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేసేందుకు త‌హ త‌హ లాడుతున్నార‌ని, పార్టీ శ్రేణులు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని, తాను వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించారు.

YS Jagan Pada Yatra

ఈ మేర‌కు జ‌నంలోకి వెళ్లేందుకు ప్లాన్ రెడీ అవుతోంద‌ని, ఆ మేర‌కు త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాన‌ని వెల్ల‌డించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇవాళ త‌న యాత్ర గురించి అధికారికంగా ధ్రువీక‌రించారు. యువ‌త ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాజ‌కీయాల‌లో మీలాంటి వారికి ఎల్ల‌ప్పుడూ ద్వారాలు తెరుచుకుని ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జా స‌హ‌కారంతో కూట‌మి చేస్తున్న ఆగ‌డాల‌ను ఎండ‌గ‌ట్టడంపైనే ఇక నుంచి ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తాన‌ని తెలిపారు.

ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక కేవ‌లం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. టీడీపీ దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా పోరాటంలో సోషల్ మీడియాను డిజిటల్ ఆయుధంగా హైలైట్ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ శాతం యువ‌కులైన వారికే సీట్లు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. మీరు లేక పోతే పార్టీ లేద‌న్నారు. ఆనాడు కేవ‌లం ఇద్ద‌రితో వైఎస్ఆర్సీపీని ఏర్పాటు చేశామ‌న్నారు. త‌న‌తో పాటు త‌న త‌ల్లి విజ‌య‌మ్మ మాత్ర‌మే ఉంద‌న్నారు. ఇవాళ ల‌క్ష‌లాది మంది పార్టీలో భాగ‌స్వామ్యులుగా ఉన్నార‌ని అదంతా మీ ఆద‌రాభిమాన‌మేన‌ని పేర్కొన్నారు.

Also Read : Minister Anam Interesting Comments : అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

Exit mobile version