YS Sharmila Fired on AP Govt : పోల‌వ‌రంపై ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం – ష‌ర్మిల

బ‌న‌క‌చ‌ర్ల బాబుకు మ‌రో ఏటీఎంగా మారింది

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : విజ‌య‌వాడ – పోలవరం ను చంపి బనకచర్ల కట్టాలని చూస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). సీఎం చంద్ర‌బాబు నాయుడుకు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ఓ ఏటీఎం లాగా మారి పోయింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే బనకచర్ల ప్రయత్నాలు బంద్ పెట్టాల‌ని, పోలవరం క‌ట్టాల‌ని, జలయజ్ఞం ప్రాజెక్ట్ లు పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించిన పాపం జగన్ రెడ్డిదేనంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు బీద ఏడుపులు ఏడవడం విడ్డూరంగా ఉంద‌న్నారు. అందరూ వద్దంటున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

YS Sharmila Slams AP Govt

గురువారం విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటు రాష్ట్ర మేధావులు వ్యతిరేకిస్తున్నార‌ని, ఆ ప్రతిపాదన పనికిరాదని సీమాంధ్ర‌ ప్రొఫెసర్లు చెబుతున్నా సోయి లేకుండా ముందుకే వెళితానంటే ఎలా అని ప్ర‌శ్నించారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజినీర్లు మొత్తు కుంటున్నారని వాపోయారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఒక్క కాంట్రాక్టర్ కు తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం ఉపయోగపడని గుదిబండ ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ అంత ఆత్రంగా ఎందుకు తిరుగుతున్నారు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు.

బనకచర్ల లింక్ ప్రతిపాదన పోలవరం అసలు ప్రాజెక్టుకే ఎసరుపె డుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతోంద‌ని , దానిని ఎందుకు పెడ‌చెవిన పెట్టారంటూ ఫైర్ అయ్యారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila).
మీ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా పోలవరాన్నే ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఎత్తు తగ్గించారా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ నీళ్ల కోసం బనకచర్ల లింక్ ప్రతిపాదన చేశారని గోదావరి అథారిటీ అడిగిన దానికి మీ సమాధానం ఎక్కడ అని నిల‌దీశారు. రాయలసీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నీళ్ల గురించి ఆలోచన చేయకుండా, ముక్కు ఎక్కడంటే తలచుట్టూ తిప్పినట్లుగా గోదావరి నుంచి తెస్తామనడం ఎవరిని మోసం చేయడానికి అంటూ ఫైర్ అయ్యారు.

Also Read : JC Prabhakar Reddy Shocking Comments : జ‌గ‌న్ పెద్దారెడ్డి విష‌యంలో జోక్యం చేసుకోకు

Exit mobile version