JC Prabhakar Reddy Shocking Comments : జ‌గ‌న్ పెద్దారెడ్డి విష‌యంలో జోక్యం చేసుకోకు

మాజీ సీఎంకు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Hello Telugu - JC Prabhakar Reddy Shocking Comments

Hello Telugu - JC Prabhakar Reddy Shocking Comments

JC Prabhakar Reddy : అనంత‌పురం జిల్లా – మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి (JC Prabhakar Reddy). ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని త‌న‌ను, త‌న కొడుకును ఇబ్బంది పెట్టిన సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. నీ కంటే ఎక్కువ నా గురించి చ‌నిపోయిన మీ నాయ‌న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి, బ‌తికి ఉన్న మీ త‌ల్లి విజ‌య‌మ్మ‌కు బాగా తెలుసన్నారు. ఆరు నూరైనా స‌రే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కాలు పెట్టనీయ‌నంటూ వార్నింగ్ ఇచ్చారు. ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు.

JC Prabhakar Reddy Shocking Comments

గురువారం తాడిప‌త్రిలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి (JC Prabhakar Reddy) మీడియాతో మాట్లాడారు. ఈరోజు ప్రసన్నకుమార్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావే, మ‌రి ఆరోజు ప్ర‌స‌న్న కుమార్ అక్క‌పై 12 కేసులు న‌మోదు చేస్తే వారి గురించి ఎవ‌రు మాట్లాడ‌తారంటూ ప్ర‌శ్నించారు. న‌న్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేశావు. అయినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డా. న‌న్ను ల‌క్ష్యంగా చేసుకుని చాలా ఇబ్బందులు పెట్టావు. అయినా భ‌రించా. ఇప్పుడు ధైర్యంగా మీ ముందు నిల‌బ‌డ్డా. కానీ ఏ ఒక్క‌రినీ తాను ల‌క్ష్యంగా చేసుకోలేద‌న్నారు. ఒక‌వేళ అలా చేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాద‌న్నారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.

అంతా అయి పోయాక పెద్దారెడ్డి వ‌స్తానంటే ఊరుకుంటానా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ నాన్న మీ తాత చాలా మంచోళ్ళు నా గురించి అడుగు వాళ్ళు ఏంటో చెబుతారు. నేను మీ తాత అప్పట్లో బొగ్గు బస్సు యజమానులమ‌ని చెప్పారు. మీ అమ్మ విజయమ్మ ఆసుపత్రికి వస్తే తాను వెళ్లి మాట్లాడాన‌ని, అది త‌న సంస్కారం అన్నారు. ఎస్వీ రవీంద్రారెడ్డి (పొట్టి రవి)ని ఐదు సంవత్సరాలు తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వకుండా చేశారు.కిందిస్థాయి కోర్టు నుండి హైకోర్టు వరకు వెళ్ళాడు కానీ అతనిని తాడిపత్రిలో అనుమతించ లేదన్నారు.

నువ్వు ఎప్పుడైనా లగ్జరీ కార్స్ గురించి విన్నావా లేదా అందులో తిరగావా బహుశా నువ్వు తిరగకబోయి ఉండొచ్చు. కానీ మీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లగ్జరీ కార్స్ వాడుతున్నాడని ఆరోపించారు. కేవలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గా చేసిన పెద్దారెడ్డి దగ్గర రేంజ్ రోవర్, బిఎండబ్ల్యూ ,ఆడి కార్లు ఉన్నాయ్. ఇవన్నీ తాడిపత్రి ప్రజలను, మున్సిపాలిటీని సర్వ నాశనం చేసి సంపాదించాడ‌ని మండిప‌డ్డారు.

Also Read : Vallabhaneni Vamsi Shocking SC : వ‌ల్ల‌భ‌నేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Exit mobile version