YS Sharmila Fired on AP Govt : సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం

ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : విజ‌య‌వాడ : సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం అని అన్నారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి . పాలనలో పారదర్శతకు నిదర్శనమ‌ని పేర్కొన్నారు. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి అని స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగం తర్వాత ప్రాముఖ్యత దక్కింది ఒక్క స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి మాత్రమేన‌ని అన్నారు. ఆదివారం ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి జవాబుదారితనం, పౌరులకు సాధికారిత సమాచార హక్కు చట్టం కల్పించిన గొప్ప వరంగా ఆమె అభివ‌ర్ణించారు. ఈ చట్టం విప్లవాత్మకం అని దేశ పౌరులకు వజ్రాయుధంగా మారింద‌ని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్నైనా పొందేందుకు 2005లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టంగా తీసుకు వ‌చ్చిందన్నారు. ఇవాళ ప్ర‌ధాన‌మంత్రి మోడీ అదే హక్కుకు తూట్లు పొడిచారని ఆరోపించారు. సమాచార హ‌క్కు చట్టానికి దగ్గరుండి మరి సమాధి కట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి.

YS Sharmila Slams

ప్ర‌ధాన‌మంత్రి గద్దెనెక్కిన నాటి నుంచే ఆర్టీఐ చట్టంపై పగ బట్టారంటూ మండిప‌డ్డారు. సవరణల పేరుతో RTIను మేడిపండు చందంగా మార్చారన్నారు. వ్యక్తిగత సమాచారం సవరణ ముసుగులో మోడీ అండ్ కో అవినీతి బయట పడకుండా సవరించుకున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఓట్ల చోరీ లాంటి దొంగ పనులను వెలుగులోకి రానివ్వకుండా స‌హ చ‌ట్టాన్ని క‌ట్ట‌డి చేశార‌ని వాపోయారు. స్వయం ప్రతిపత్తిగా పని చేయకుండా సంకెళ్లు వేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. కేంద్ర సమాచార కమిషన్ కి చీఫ్ లేరు. కనీసం పూర్తిస్థాయిలో సభ్యుల నియామకం కూడా జరగలేదన్నారు.

Also Read : IND vs WI 2nd Test – Kuldeep Yadav Growth : కుల్దీప్ యాద‌వ్ సూపర్ షో విండీస్ ఫాలో ఆన్

Exit mobile version