IND vs WI 2nd Test – Kuldeep Yadav Growth : కుల్దీప్ యాద‌వ్ సూపర్ షో విండీస్ ఫాలో ఆన్

2వ టెస్ట్ లో పూర్తి ఆధిక్యంలో భార‌త జ‌ట్టు

Hello Telugu - IND vs WI 2nd Test - Kuldeep Yadav Growth

Hello Telugu - IND vs WI 2nd Test - Kuldeep Yadav Growth

Kuldeep Yadav : ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రుగుతున్న కీల‌క‌మైన 2వ టెస్టు మ్యాచ్ లో పూర్తి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమిండియా. తొలుత ఇండియా జ‌ట్టు భారీ స్కోర్ సాధించింది. యంగ్ క్రికెట‌ర్లు య‌శ‌స్వి జైశ్వాల్ 175 ర‌న్స్ చేస్తే కెప్టెన్ గిల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్ లో 518 ప‌రుగులు 5 వికెట్లు కోల్పోయి చేసింది. అనంత‌రం భారీ ల‌క్ష్యం ముందుండ‌గా బ‌రిలోకి దిగింది వెస్టిండీస్ టీం. భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు 248 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. కుల్దీప్ యాద‌వ్ (Kuldeep Yadav) సూప‌ర్ షో చేశాడు. త‌ను దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 ఛాంపియ‌న్ కావ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు. త‌ను 17 వికెట్లు తీశాడు. మెగా టోర్నీలో టాప్ లో నిలిచాడు.

IND vs WI 2nd Test – Kuldeep Yadav

ప్ర‌స్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది వెస్టిండీస్ జ‌ట్టు. ఓవ‌ర్ నైట్ స్కోర్ 4 వికెట్లు కోల్పోయి 140 ర‌న్స్ చేసింది. ఆట ప్రారంభం అయ్యాక రెండో సెష‌న్ లో మ‌రోసారి స‌త్తా చాటాడు కుల్దీప్ యాద‌వ్ త‌న బౌలింగ్ తో. విండీస్ ప్లేయ‌ర్ల‌ను క‌ట్ట‌డి చేసింది. ర‌వీంద్ర జ‌డేజా 46 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జ‌స్ ప్రీత్ బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. ఇక విండీస్ కు చుక్క‌లు చూపించాడు కుల్దీప్ యాద‌వ్ 82 ర‌న్స్ ఇచ్చి కీల‌క‌మైన 5 వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్ లో 81.5 ఓవ‌ర్ల‌లో 248 ర‌న్స్ చేసింది. అలిక్ అథ‌నాజ్ 41 ర‌న్స్ చేయ‌గా షాయ్ హోప్ 36 ప‌రుగులు చేశాడు.

Also Read : Sunil Gavaskar Shocking Comments on Jaiswal : జైస్వాల్ ట‌న్నుల కొద్దీ ప‌రుగులు చేయాలి

Exit mobile version