YS Sharmila Interesting : పార్టీలు ప‌క్క‌న పెట్టండి జ‌స్టిస్ కు మ‌ద్ద‌తివ్వండి

పిలుపునిచ్చిన ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైస్ ష‌ర్మిల

Hello Telugu - YS Sharmila Interesting

Hello Telugu - YS Sharmila Interesting

YS Sharmila : విజ‌య‌వాడ – ఇండియా కూట‌మి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డిని ప్ర‌క‌టించింది. దీనిపై స్పందించారు ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీల‌కు అతీతంగా జ‌స్టిస్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు. ఆత్మ ప్ర‌భోదానుసారం ఓటు వేయాల‌ని కోరారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టీ న్యాయ నిపుణుడికి INDIA కూటమి అవకాశం ఇవ్వడం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు ష‌ర్మిలా రెడ్డి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని తెలిపారు. ఆయ‌న వృత్తి ప‌రంగా ఎంతో గౌర‌వాన్ని తీసుకు వ‌చ్చార‌ని తెలిపారు.

YS Sharmila Requests

దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి న్యాయరంగ నిపుణులు ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటేనే న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.ఈ సంద‌ర్బంగా రాజ్యాంగం పరిరక్షించ బడుతుందని INDIA కూటమి బలంగా నమ్ముతుంద‌న్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన తెలుగు వారికి దక్కిన గౌరవం అని దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ఎన్నికైన ఎంపీల‌పై ఉంద‌న్నారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇది అని స్ప‌ష్టం చేశారు. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే సమయం ఆసన్న‌మైంద‌ని అన్నారు షర్మిలా రెడ్డి. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు.

Also Read : IMD MD Warning – Heavy Rains : కుండ పోత వ‌ర్షం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం : ఎండీ

Exit mobile version