IMD : అమరావతి – బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి ప్రాజెక్టులు నిండి పోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదే సమయంలో గోదావరి, కృష్ణా నదులు ఉగ్ర రూపం దాల్చాయి. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (IMD). ఆయన సూచనలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది.
IMD Warning – Heavy Rains
సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లను సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో విపత్తుల నిర్వహణ, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా అంతకంతకూ వరద నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో కృష్ణా నది పరీవాహక ప్రజలు, లంక లోతట్టు వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. ఇందుకు గాను అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసరం అయితే తప్పా బయటకు రావద్దని సూచించారు మంత్రి వంగలపూడి అనిత.
Also Read : AP Govt Important Update : ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ
