YS Sharmila : విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు కేంద్ర ప్రభుత్వంపై. ప్రధానంగా నరేంద్ర మోదీ నిర్వాకం కారణంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. ఏం సాధించారని ఇప్పుడు జీఎస్టీ గురించి, సంస్కరణలు తీసుకు వచ్చామంటూ గొప్పలు చెబుతున్నారంటూ ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా ఈ దేశాన్ని బహిరంగంగానే దోచుకున్నారని, ఆ తర్వాత జీఎస్టీ పేరుతో పెద్దలకు లాభం చేకూర్చేలా పన్నులు విధించారని ఆరోపించారు. ఒక రకంగా చెప్పాలంటే జీఎస్టీ తో దోచింది కొండంత అయితే తగ్గించింది కేవలం గోరవంత మాత్రమేనని మండిపడ్డారు.
YS Sharmila Shocking Comments on GST
గత 8 ఏళ్లలో మోడీ మోపిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం అక్షరాల 55.44 లక్షల కోట్లు అని సంచలన ఆరోపణలు చేశారు. 2.O సంస్కరణల ముసుగులో తగ్గింపు విలువ కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు షర్మిలా రెడ్డి. GST పేరుతో చేసిన లోతైన గాయానికి అయింట్మెంట్ రాయాలని చూశారని ఫైర్ అయ్యారు. బీజేపీ బ్యాండ్ ఎయిడ్ రాజకీయాలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని హెచ్చరించారు. జీఎస్టీపై పైకి చెబుతున్నదంతా అబద్దమేనని అన్నారు. ఇన్నాళ్లు పన్నుల మోత మోగించి, సామాన్యులను గుల్ల చేసింది చాలక ఇప్పుడేదో నవశకం ఆరంభమని, నవతరమని, ఆత్మ నిర్భరత లాంటి శుద్ధపూస మాటలు మోడీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు షర్మిలా రెడ్డి.
Also Read : CM Chandrababu Important Update : సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ

















