వరంగల్ జిల్లా : జాతీయ ఉపాధి హామీ పథకంలో వరంగల్ జిల్లా అరుదైన ఘనతను సాధించింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద వేతన చెల్లింపులు ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. కాగా తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ జిల్లాలోని అర్హులైన గ్రామీణ కుటుంబాలలో దాదాపు 99.97 శాతం కుటుంబాలకు కింద ఉపాధి కల్పించబడింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో 2024–25 , 2025–26 వరంగల్ జిల్లాలో ఉపాధి కోరిన అర్హులైన గ్రామీణ కుటుంబాలలో వరుసగా దాదాపు 99.99 శాతం, 99.97 శాతం కుటుంబాలకు ఈ పథకం కింద ఉపాధి లభించేలా చేశారు.
అంతే కాకుండా ఒక్కో కుటుంబానికి కల్పించిన సగటు ఉపాధి దినాల సంఖ్య 2024–25లో 41.12గానూ, 2025–26లో 27.89గానూ నమోదైందని పేర్కొన్నారు. ఈ పథకం కింద, వేతన చెల్లింపులు ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, గత సంవత్సరాలకు సంబంధించిన చెల్లించాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చెల్లించ బడతాయి. తదనుగుణంగా 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలన్నీ ఇప్పటికే పరిష్కరించబడ్డాయి. లోక్‌సభలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ ఈ విషయాన్ని తెలిపారు. గత రెండేళ్లలో వరంగల్‌లో MGNREGS పనితీరు గురించి, అలాగే ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి కల్పించిన సగటు ఉపాధి దినాల సంఖ్య గురించి ఆమె వివరాలు కోరారు.

















