YS Sharmila : అమరావతి : మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). శనివారం పెడన నియోజక వర్గం బంటుమిల్లి మండలంలో పర్యటించారు. తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. తుఫాను బీభత్సం సృష్టించిందన్నారు. ఎక్కడ చూసినా పంటలు నేలమట్టం అయ్యాయని పేర్కొన్నారు. అసలే రాష్ట్ర రైతులు అప్పుల్లో ఉన్నారని , ఈ సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు. ఇప్పుడు తుఫాను మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని ఆరోపించారు షర్మిలా రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదన్నారు. నష్టం ఎక్కువ జరిగిందని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాలని అనుకున్నారేమో నని ఎద్దేవా చేశారు.
YS Sharmila Strong Demand
సర్కార్ అంచనాలకు జరిగిన నష్టానికి పొంతన లేదని మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 8 వందల కోట్లు మాత్రమే వ్యవసాయానికి నష్టం అని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనా పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. ఎక్కడ రైతులను పలకరించినా ఇది అబద్ధం అంటున్నారని అన్నారు . చేపట్టిన సర్వే శాస్త్రీయంగా జరగలేదని తేలి పోయిందన్నారు. రైతుల దగ్గరకు వెళ్ళి అసలు పంట నష్టం అంచనా వేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కేవలం వరి పంట 13 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. ప్రత్తి పంట 3 లక్షల ఎకరాలలో పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Srinivas Naidu Shocking TDP : టీడీపీకి షాక్ బీఆర్ఎస్ పార్టీలోకి జంప్
