Srinivas Naidu Shocking TDP : టీడీపీకి షాక్ బీఆర్ఎస్ పార్టీలోకి జంప్

కండువా క‌ప్పుకున్న శ్రీ‌నివాస నాయుడు

Hello Telugu - Srinivas Naidu Shocking TDP

Hello Telugu - Srinivas Naidu Shocking TDP

Srinivas Naidu : హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఎవ‌రు గెలుస్తార‌నేది ఉత్కంఠ రేపుతోంది. ఈ త‌రుణంలో ఆయా పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస్ నాయుడు (Srinivas Naidu), ఆయ‌న స‌తీమ‌ణి సుజాత తో పాటు ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. త‌న నామినేషన్‌ విత్‌డ్రా చేసుకొని బీఆర్ఎస్‌కు సపోర్ట్‌ చేస్తున్న ప్రవీణ్‌కు అభినందన‌లు తెలిపారు. శ్రీనివాస్‌ నాయుడు చాలాకాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయ‌న ఐదేళ్ల కింద‌టే రావాల్సి ఉంద‌న్నారు. మన పార్టీ నుంచి గెలిచి మేయర్‌ అయిన వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీలో చేరార‌ని అన్నారు.

TDP General Secretary Srinivas Naidu Joined in BRS

రేవంత్‌ రెడ్డే ఏ పనులు చేయడం లేద‌ని, ఇక‌ మేయర్‌ మనకు ఏం పనులు చేస్తుందంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. అహానా పెళ్లంట సినిమా తరహాలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు. కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారంటూ మండిప‌డ్డారు. తులం బంగారం అని.. గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారు, గ్యారెంటీ కార్డులు ఇంటింటికి పంచి ఆగమాగం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తే, పైనుంచి తులం బంగారం కూడా ఇస్తానని మాట తప్పారు రేవంత్‌ రెడ్డి అంటూ మండిప‌డ్డారు కేటీఆర్. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు తులం బంగారం ఇవ్వకపోగా.. మెడలో గొలుసు కూడా లాక్కెళ్తున్నారంటూ వాపోయారు.

Also Read : Kasibugga Stampede- People Death : కాశీబుగ్గ ఆల‌యంలో తొక్కిస‌లాట ప‌లువురు మృతి

Exit mobile version