YS Sharmila Fired on AP Govt : యూరియా స‌ర‌ఫ‌రాలో కూట‌మి స‌ర్కార్ ఫెయిల్

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంపై. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది స‌ర్కార్ తీరు అంటూ ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీరేదెన్నడు..?రైతుల పంట పండేదెన్నడు అంటూ ప్రశ్నించారు. యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? అని మండిప‌డ్డారు. యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కుంటి సాకులు త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్ కి కారణం అవుతున్నారని, రాష్ట్రంలో టాప్ 5 లో క్యాన్సర్ రోగం ఉందని, ఏడాదికి ఒకే సారి వరి సాగు చేయాల‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

YS Sharmila Slams AP Govt for Urea Shortage

యూరియా వాడుకుంటే 800 రూపాయలు ఇస్తామని, అసెంబ్లీ వేదికగా రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదంగా ఉంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్‌. రైతు సంక్షేమమే అజెండా అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసిందని మండిప‌డ్డారు. ధాన్యాగారానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్ర రైతులకు వ్యవసాయం మీద నీతులు నేర్పడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనం అన్నారు. యూరియా ఎక్కువ చల్లి రైతులు పండించే బియ్యం తినడానికి పనికి రావనడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించినట్లేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఖరీఫ్ సీజన్ లో 14 లక్షల హెక్టార్లలో వరి సాగువుతుంటే ఎంత యూరియా అవసరమో తెలియదా అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు ష‌ర్మిలా రెడ్డి.

Also Read : Ex MLC Kavitha Shocking Comments : కుల స‌ర్వే వివ‌రాలు బ‌య‌ట పెట్టాలి : క‌విత

Exit mobile version