YS Jagan Fired on CM Chandrababu : సంప‌ద సృష్టిస్తాన‌ని స్వాహా చేస్తే ఎలా..?

చంద్ర‌బాబు నాయుడుపై జ‌గ‌న్ కామెంట్స్

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

YS Jagan : అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan). ఆయ‌న పాల‌న పూర్తిగా అధ్వాన్నంగా మారింద‌న్నారు. ఇచ్చిన హామీల‌ను నెర‌వ‌ర్చడంలో ఫోక‌స్ పెట్ట‌కుండా త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారంపైనే ఎక్కువ‌గా దృష్టి సారించార‌ని ఆరోపించారు. ఓ వైపు సాగు చేసుకున్న రైతులు నానా తంటాలు ప‌డుతున్నార‌ని, యూరియా కొర‌త కార‌ణంగా అయినా నిమ్మ‌క నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అన్ని రంగాల‌లో ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కార్ విఫ‌లం చెందింద‌న్నారు. పెట్టుబడులు, కంపెనీల పేరుతో ప్ర‌చారం త‌ప్పా రాష్ట్రానికి ఒన‌గూరింది ఏమీ లేద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

Ex CM YS Jagan Slams CM Chandrababu

ఏపీ సీఎం మోసం చేయ‌డంలో దిట్ట అని పేర్కొన్నారు. త‌న ఆస్తుల‌ను పెంచుకుంటున్నారే త‌ప్పా ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు మాజీ ముఖ్య‌మంత్రి. చంద్రబాబు అనుకున్నంత పని చేయలేదన్నారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పార‌ని, ఓట్లు వేయించుకున్నాక‌, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లంలా దోచి పెడుతున్నాడ‌ని ఆరోపించారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించాల‌న్నారు. తమ ప్ర‌భుత్వ హ‌యాంల‌ పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కేబినెట్‌లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం, అవినీతిలో మీ బరితెగింపుకు నిదర్శనం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా , పెట్టుబ‌డిదారుల‌కు దోచి పెడుతున్నాడ‌ని మండిప‌డ్డారు.

Also Read : CM Chandrababu – Health Emergency : తుర‌క‌పాలెంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ : సీఎం

Exit mobile version