న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా హైదరాబాద్ కు చెందిన పేసర్ మహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేయక పోవడం వెనుక మతం కారణమని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. దీనిపై శుక్రవారం కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తుది పదకొండు మంది ఆటగాళ్ల జాబితాలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కక పోవడానికి అతని మతమే కారణమని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎవరికీ మతం ఆధారంగా వివక్ష చూపడం లేదా అవకాశాలను నిరాకరించడం జరగదని స్పష్టం చేశారు. అవకాశాలు అనేవి ఒక వ్యక్తి మతం లేదా కులం ఆధారంగా కాకుండా వారి ప్రతిభ , సామర్థ్యంపై ఆధారపడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
మన దేశంలో మతం ప్రాతిపదికన ఎవరినీ వివక్షకు గురి చేయడం లేదా విస్మరించడం జరగదని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అవకాశాలు అనేవి ప్రతిభ, సామర్థ్యంపైనే ఆధారపడి ఉండాలి. ఒక వ్యక్తి మతం లేదా కులాన్ని చూసి వారికి పనులు అప్పగించడం లేదా నిరాకరించడం అనేది ఉండదు, అలాగని జరగదన్నారు కిరణ్ రిజిజు. ఇలాంటి ఆలోచన కలిగి ఉండటమే తప్పు అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి) ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ (ఒకే భారతం, గొప్ప భారతం) అనే సూత్రాలను నమ్ముతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక నుంచి బాధ్యత కలిగిన ఎంపీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
