Ex CM YS Jagan Shocking : ఓల్వో బ‌స్సు ద‌గ్ధం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

ప‌లువురు స‌జీవ ద‌హ‌నం..సీఎం దిగ్భ్రాంతి

Hello Telugu - Ex CM YS Jagan Shocking

Hello Telugu - Ex CM YS Jagan Shocking

YS Jagan : తాడేప‌ల్లిగూడెం : కర్నూలు జిల్లాలో కావేరీ సంస్థ‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం అయ్యింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట ప‌డ‌గా ప‌లువురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan). ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు. చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, జగన్‌ అన్నారు. ఈ ఘోర ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందని. ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

YS Jagan Shocking for Kurnool Volvo Bus Fire

మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఈ ఘ‌ట‌న గురించి ఉన్న‌తాధికారులు తెలిపారు. ఆయ‌న వెంట‌నే సీఎస్ విజ‌య్ కుమార్ కు ఫోన్ చేశారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. మంత్రులు ఘ‌టనా స్థ‌లానికి వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మందిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి హుటా హుటిన క‌ర్నూలు జిల్లాకు వెళ్లారు. మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని ఆదేశించారు. ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

Also Read : CM Chandrababu Shocking : బ‌స్సు ప్ర‌మాదంపై సీఎం దిగ్భ్రాంతి

Exit mobile version