మురికివాడల పునరాభివృద్ధికి స‌ర్కార్ కొత్త విధానం

నూత‌నంగా ప్ర‌తిపాదించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

hellotelugu-APGovt

అమ‌రావ‌తి : మురికివాడల పునరాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకు వ‌చ్చేలా చేస్తోంది. మ‌హారాష్ట్ర‌లోని ధారావిలో అమలు చేసిన తరహాలో భారీ స్థాయి పట్టణ పునరాభివృద్ధి నమూనాలను అనుసరిస్తూ ప్రభుత్వ ఖజానాపై ప్రత్యక్ష ఆర్థిక భారాన్ని తగ్గించేలా ప్రస్తుత నివాసితులకు ఆధునిక గృహాలను కల్పించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. రద్దీగా ఉండే పట్టణ నివాస ప్రాంతాలను ఆధునీకరించే దిశగా కీలక అడుగు వేస్తూ, మురికివాడల పునరాభివృద్ధికి సంబంధించిన కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. దీనిని విశాఖపట్నంలోని వేలంపేట మురికివాడలో మొదటగా అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది స‌ర్కార్. ధారావి తరహా భారీ పట్టణ పునరాభివృద్ధి నమూనాలను అనుసరిస్తూ ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా ఈ విధానం రూపొందించారు.

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా జోన్-IVవార్డు నంబర్ 35 పరిధిలోని వేలంపేట మురికివాడను ‘డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్’ పద్ధతిలో పునరాభివృద్ధి చేయడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేవలం 1,986.45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 45 మీటర్ల ఎత్తు వరకు ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించడం ద్వారా, ఈ ప్రాజెక్ట్ 177 గృహ యూనిట్లను అందుబాటులోకి తీసుకు రానుంది. సంప్రదాయ ప్రభుత్వ నిధులపై పూర్తిగా ఆధార పడకుండా ఎంపికైన ప్రైవేట్ కాంట్రాక్టర్ ‘ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్’ విధానం ద్వారా ఈ పునరాభివృద్ధిని చేపడతారు. పోటీతత్వంతో కూడిన టెండర్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాజెక్టును కేటాయించనున్నారు. ఇందులో గరిష్ట బిడ్డింగ్ ప్రమాణంగా 1:4 వరకు టీడీఆర్ నిష్పత్తిని ప్రభుత్వం అనుమతించింది. బిడ్డర్ నిర్మాణ వ్యయానికి బదులుగా టీడీఆర్ అవసరాన్ని పోటీతత్వంతో కూడిన ధరగా పేర్కొంటారని తెలిపింది.

Exit mobile version