CM Chandrababu Shocking : బ‌స్సు ప్ర‌మాదంపై సీఎం దిగ్భ్రాంతి

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

Hello Telugu - CM Chandrababu Shocking

Hello Telugu - CM Chandrababu Shocking

CM Chandrababu : అమ‌రావ‌తి : కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu). బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై ప‌ట్ల ఆవేద‌న చెందారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు సీఎస్. సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని స్ప‌ష్టం చేశారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

CM Chandrababu Shocking for Kurnool Bus Accident

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వ‌ద్ద‌ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి. ఆయ‌న తెలిసిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం వ్య‌క్తం చేశారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మనసును కలచి వేసిందన్నారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారని, మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని ఆదేశించామ‌న్నారు మంత్రి.

Also Read : KCR Calls for BRS Victory : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో గులాబీ జెండా ఎగ‌రాలి

Exit mobile version